Топ-100
Back

ⓘ సంఘాలు ..




                                               

భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం

భారతీయ మహిళా శాస్త్రవేత్తల అసోసియేషన్ అనునది భారతీయ స్వచ్చంద,ప్రభుత్వేతర సంస్థ. ఇది 1973 నుండి మహిళా శాస్త్రవేత్తలను సేవలందిస్తుంది.ఇది దేశవ్యాప్తంగా పది శాఖలతో విస్తరించి ఉంది. ఈ అసోషియేషన్ ప్రధాన కార్యాలయం వషి వద్ద కలదు. ఈ సంస్థ వసతిగృహం, సంరక్షణ, నర్సరీ సౌకర్యాలను వంటి మౌలిక సదుపాయలను అందిస్తుంది. ఈ సంస్థ అధ్వర్యంలో ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, ఒక ఆరోగ్య సంరక్షణా కేంద్రం, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం, ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయ శిక్షనా ప్రోగ్రాం లను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు మొదటి ప్రెసిడెంట్ ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్త సుమతి భిడే.

                                               

సహకార సంఘాలు

కొంతమంది వ్యక్తులు కలసి తమ అందరి బాగోగుల కోసం పనిచేయడాన్ని సహకారం అంటారు. ఒక్కరు చేయలేని పనిని కొంతమంది కలసి సాధించవచ్చును. ఇలా కొంతమంది కలసి ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమించడమే సహకారోద్యమం. ఇలా ఏర్పడిన సంఘాలను సహకార సంఘాలు అంటారు. ఇందులో భాగస్వాములైన వ్యక్తులకు కొన్ని నిర్ధిష్టమైన ఆశయాలుంటాయి. సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరూ కలసి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సహకార సంఘాలు మొదట జర్మనీ దేశంలో స్థాపించబడ్డాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సహకారోద్యమం ప్రారంభమైంది. భారతదేశంలో 1904 సంవత్సరంలో ఈ ఉద్యమం ప్రారంభమైనది. వీటికి సహాయం చేయడానికి ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖలు ఏర్పాటుచ ...