Топ-100
Back

ⓘ అష్టగురువులు. వివిధ రకాలైన జ్ఞానాన్ని అందించే వారు గురువులు. ఆ గురువులు వారు అందించే జ్ఞానం ఆధారంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించబడతారు. అష్టగురువులు: శాస్త్రాభ్యా ..




                                     

ⓘ అష్టగురువులు

వివిధ రకాలైన జ్ఞానాన్ని అందించే వారు గురువులు. ఆ గురువులు వారు అందించే జ్ఞానం ఆధారంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించబడతారు.

అష్టగురువులు:

  • శాస్త్రాభ్యాసం చేయించినవారు
  • టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పినవారు
  • బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవారు
  • పురాణాదికాలను చెప్పినవారు
  • అక్షరాభ్యాసం చేయించినవారు
  • శైవ, వైష్ణవ సంప్రదాయాలను బోధించినవారు
  • ఉపనయనంలో గాయత్రీ మంత్రము ఉపదేశించినవారు
  • వేదాధ్యయనం చేయించినవారు
                                     

1. వివిధ రకాల గురువులు

  • సూచక గురువు: శమాది షట్కసంపత్తిని బోధించి ఇంద్రియ నిగ్రహం కలిగించే వారు. ఏకాగ్రతతో చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధమవుతాయో తెలిపే గురువులు.
  • విహిత గురువు: సందేహాలను తీర్చి చిత్తశుద్ధి కలిగించి, ఆత్మయే సత్యమని దృఢమైన బోధ చేసేవారు. అంతు చిక్కని, అని నిగూఢమైన, సృష్టి తత్వాన్నిబోధించి విశ్వరూపుని దర్శింగు మార్గమును చూపించే గురువు. ఇతనిని విహితోపదేష్ట గురువు అనికూడా అంటారు.
  • ప్రసిద్ధ దేశికులు: ఫతిఫలాన్ని ఆశించకుండా ఆధ్యాత్మిక బోధనలు చేసే వారు.
  • కారణ గురువు: జీవబ్రహ్మలకు ఐక్యతను బోధించేవారు. ఇహలోక, సంపద సుఖాలపై, మోహమును పోగొట్టి ముక్తి అనే సంపదను కైవసం చేగించగల గురువు.
  • వైదిక గురువులు: వేదార్ధంతో భగవంతుని వైపు దృష్టి మరల్చేవారు. అనగా వేదాలలోని వేదాంత భావములను వివరించువారు.
  • కామ్యక గురువులు: పుణ్యకార్యాల ద్వారా పుణ్యసంపాదన చేయించేవారు. పాప పుణ్య క్రియల వల్ల సంభవించే పాపపుణ్య ఫలితాల గూర్చి చెప్పేవారు.
  • వాచక గురువు: యోగాతత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని అనుభవింప చేసేవారు. అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువాడు.
  • బోధక గురువులు: శాస్త్రాన్ని యధాతధంగా చెప్పేవారు. ఏమాత్రము అనుభవ జ్ఞానం లేక, గ్రంథములో ఉన్న విషయాన్ని యదాతథంగా బోధించేవాడు. వీరు బోధక గురువులుగా వ్యవహరించబడతారు.