Топ-100
Back

ⓘ అంతర్జాతీయ దినములు ..




                                               

అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది.

                                               

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.

                                               

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి ఏట మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.

                                               

అంతర్జాతీయ టీ దినోత్సవం

అంతర్జాతీయ టీ దినోత్సవం ప్రతి ఏట డిసెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

                                               

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.

                                               

అంతర్జాతీయ పర్వత దినోత్సవం

2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబరు 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావలసినవి దొరకడం కష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వ్యక్తుల ద్వారా పర్వత ప్రాంత అభివృద్ధికి కావలసిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడంకోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.