Топ-100
Back

ⓘ మతము ..
                                               

ఇబ్రాహీం మతము

ఇబ్రాహీం మతము ఒక ఏకేశ్వరోపాసక మతము. ఈ ఏకేశ్వరోపాసక విధానము ఆదమ్ ప్రవక్తతోనే ఆరంభమైనది. కాని దీనిని పునర్-వ్యవస్థీకరించిన ఇబ్రాహీం లేదా అబ్రహాము దీని స్థాపకుడిగా భావింపబడుతాడు. ఆదమ్ ప్రవక్మత పరంపర ఇద్రీస్, నూహ్, సాలెహ్ లతో కొనసాగి, ఇబ్రాహీం మతముగా స్థిరపడి కొన్ని ప్రధాన మతములకు పునాది వేసింది. ఉదాహరణకు జుడాయిజం లేదా యూద మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం, కొన్ని సార్లు బహాయి విశ్వాసము కూడా. ఇంకా కొన్ని మతములు ఈ కోవకు చెందుతాయి. ఉదాహరణకు డ్రూజ్ మతము. ఈ ఇబ్రాహీం మతమును, ప్రపంచంలోని దాదాపు సగం జనాభా అవలంబిస్తోంది. 380 కోట్లమంది, ఈ మతాన్ని అవలంబిస్తున్నారు. తూర్పు మతములు ఇంకో ప్రధాన మతముల సమూహము, ...

                                               

విధిరాత

విధిరాత అంటే విధాత రాసిన రాత. దీనినే తలరాత అని కూడా అంటారు. ప్రతి మనిషికీ భగవంతుడు కష్ట సుఖాలను ముందే నిర్ణయిస్తాడు అనేది ధార్మక మతాల సిద్ధాంతం. ధార్మిక మతాల ప్రకారం మనిషి చేసిన కర్మల పక్రారం ఆ కర్మ ఫలం అనుభవించి తీరాలి. అబ్రహమిక్ మతాలలో కూడా విధిరాత మీద నమ్మకాలు ఉన్నాయి. రెండిటికీ స్వల్ప తేడా ఉంది. ధార్మిక మతాల ప్రకారం భగవంతుడు మనిషికి కష్టసుఖాలను నిర్ణయిస్తాడే తప్ప మనిషి చేసే మంచి లేదా చెడును నిర్ణయించడు. అబ్రహమిక్ మతాల ప్రకారం మనిషి చేసే అన్ని పనులు భగవంతుడు నిర్ణయిస్తాడు.