Топ-100
Back

ⓘ ఆగ్నేయ రైల్వే. భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ రైల్వే ఒకటి. ఈ రైల్వే జోన్ గార్డెన్ రీచ్, కోలకతా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ లో ..




ఆగ్నేయ రైల్వే
                                     

ⓘ ఆగ్నేయ రైల్వే

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ రైల్వే ఒకటి. ఈ రైల్వే జోన్ గార్డెన్ రీచ్, కోలకతా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ లో మొత్తం అద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ నాలుగు విభాగాలు ఉన్నాయి.

                                     

1.1. చరిత్ర బెంగాల్ నాగపూర్ రైల్వే

నాగపూర్-ఛత్తీస్‌ఘడ్ రైల్వే లైన్ మార్చేందుకు 1887 సంవత్సరములో బెంగాల్ నాగ్పూర్ రైల్వే బిఎన్‌ఆర్ కంపెనీలో, బ్రాడ్ గేజ్ చేయడానికి విలీనం చేయబడింది. ఈ పని 1888 లో పూర్తయింది. నాగపూర్ నుంచి అస్సంసోల్ వరకు వున్న ప్రధాన రైలు మార్గము యొక్క పొడిగింపు 1891 లో పూర్తయింది. బిలాస్‌పూర్ నుండి 161 మైళ్ల పొడవైన శాఖ లైన్ 258 కిమీ ఉమారియా బొగ్గు గని వరకు కలుపుతూ ఒక రైలు మార్గము నిర్మించారు. ఈ మార్గమును అప్పటికే ఉమారియా నుండి కట్నీ 1891 వరకు వున్నటువంటి రైలు మార్గమునకు అనుసంధానము చేశారు. ఇరవయ్యో శతాబ్దం నందు, మారుతున్న పని మార్పులు చెందుతున్న పనులు దృష్ట్యా కలకత్తా-బొంబాయి, కలకత్తా-మద్రాస్ రైలు మార్గము పనులు పూర్తి అయినవి. ఇరవయ్యో శతాబ్దపు మొదటి అర్ధ భాగములో బెంగాల్ నాగ్పూర్ రైల్వే బిఎన్‌ఆర్ కంపెనీలో రైలు మార్గము పని క్రమంగా పురోగమించింది. నెర్‌గుండి నుండి మొదలు పెట్టి ఒక రైల్వే లైన్ ద్వారా 1921 సంవత్సరములో తాల్‌చర్ కోల్‌ఫీల్డ్స్ నకు రైలు మార్గము ఏర్పాటు చేసారు. 1931 లో రాయపూర్ నుండి విజయనగరం నకు అనగా భారతదేశము లోని సెంట్రల్ ప్రావిన్స్ తో, ఈస్ట్ కోస్ట్ ప్రదేశములకు ఒక రైలు మార్గము ఏర్పాటు అయ్యింది. 1930 చివరి నాటికి బి.ఎన్.ఆర్. బిఎన్‌ఆర్ దేశంలోని అతిపెద్ద నారో గేజ్ నెట్వర్క్ వాటా కలిగి ఉంది. బి.ఎన్.ఆర్. బిఎన్‌ఆర్ నిర్వహణ 1944 అక్టోబరు 1 న బ్రిటీష్ భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక ఆ పేరు ద్వారానే ఏప్రిల్ 1952 14 వరకు అది కొనసాగింది. ఇది ఈస్ట్ ఇండియన్ రైల్వేతో ఉమ్మడి ఉన్నప్పుడు, భారతీయ రైల్వేలు కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు మండలాలు జోన్లలలో ఒకటి అయిన తూర్పు రైల్వేగా రూపాంతరము చెందింది.

                                     

1.2. చరిత్ర ఆగ్నేయ రైల్వే

ఆగస్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే బిఎన్‌ఆర్ దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు, నార్త్ సెంట్రల్ ప్రాంతంలో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది. జూలై 1967 లో, సౌత్ ఈస్ట్రన్ రైల్వే బంకురా దామోదర్ నదీ తీరాన్ని స్వాధీనం చేసుకుంది.

ఏప్రిల్ 2003 వరకు, దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్, ఆద్ర, సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం, చక్రధర్‌పూర్, బిలాస్‌పూర్, నాగపూర్ ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. ఏప్రిల్ 2003 లో ఆగ్నేయ రైల్వే నుండి రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 2003 ఏప్రిల్ 1 న సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క ఖుర్దా రోడ్, సంబల్పూర్, విశాఖపట్నం విభాగాలు కలిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇ.కో.ఆర్ దేశానికి అంకితం చేయబడింది; 2003 ఏప్రిల్ 5 న దక్షిణ తూర్పు రైల్వే యొక్క నాగపూర్, బిలాస్‌పూర్ డివిజన్లు, ఒక కొత్తగా ఏర్పడ్డ రాయపూరు డివిజను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఆగ్నేయ మధ్య రైల్వే దేశానికి అంకితం చేయబడింది.

2003 ఏప్రిల్ 13 న, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోను కొత్తగా రాంచి డివిజనును ఏర్పరచటానికి ఆద్రా, చక్రదార్పూర్ విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. ఆగ్నేయ రైల్వేలో టికియాపారా, పాన్సుర లలో ఎలక్ట్రిక్ బహుళ యూనిట్ షెడ్స్ ఉన్నాయి. ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్డ్లు సంత్రాగాచి, టాటానగర్, బొకారో స్టీల్ సిటీ, బోండముండాలలో ఉన్నాయి. డీజిల్ లోకోమోటివ్ షెడ్డ్లు ఖరగ్‌పూర్, బొకారో స్టీల్ సిటీ, బోండముండాలలో ఉన్నాయి. కోచ్ నిర్వహణ యార్డ్ సంత్రాగచిలో ఉంది. దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్‌లో ఒక ప్రధాన వర్క్ షాప్ ఉంది.

                                     

2. పరిపాలన

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే సేవలు అందిస్తుంది. ఇది కోల్‌కతా, హల్దియాలకు ప్రధాన సరుకు రవాణాను కూడా నిర్వహిస్తుంది. ఆగ్నేయ రైల్వే హౌరా నుండి ఖరగ్పూర్, ఆమ్తా, మెదినాపూర్, టాటానగర్, భాలసోర్, రూర్కెలా, సంత్రాగచి నుండి షాలిమార్, కోల్‌కతా ప్రక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా సాధారణ విద్యుత్ బహుళ యూనిట్లు ఈఎంయు సేవలు నడుస్తుంది.

                                     

3.1. దక్షిణ తూర్పు రైల్వేచే నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్లు సుదూర రాత్రిపూట రైళ్లు

  • 18030/18029 షాలిమార్ – ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి లోకమాన్య తిలక్ టెర్మినస్
  • 12860/12859 గీతాంజలి ఎక్స్‌ప్రెస్ హౌరా ముంబై
  • 18615/18616 హౌరా - హతియా ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి హతియా
  • 22853/22854 షాలిమార్ – విశాఖపట్నంఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి విశాఖపట్నం
  • 12870/12869 హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి ముంబై
  • 12867/12868 హౌరా - పాండిచేరి ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి పాండిచేరి
  • 12839/12840 హౌరా - చెన్నై మెయిల్ హౌరా చెన్నై
  • హౌరా - ముంబై సిఎస్‌టి వయా నాగపూరు సూపర్‌ఫాస్ట్ మెయిల్
  • 12817/12818 జార్ఖండ్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ హతియా నుండి ఆనంద్ విహార్ టెర్మినల్
  • 18645/18646 ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా హైదరాబాద్
  • 22845/22846 హతియా - పూణే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హతియా నుండి పూణే
  • 12585/12586 హౌరా – సంబాల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి సంబాల్‌పూర్
  • 12574/12573 హౌరా - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి షిర్డి
  • 22829/22830 షాలిమార్ - భుజ్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి భుజ్ వయా-టాటానగర్-బిలాస్‌పూర్
  • 12877/12878 గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రాంచి నుండి న్యూ ఢిల్లీ
  • 18005/18006 హౌరా - కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి కోరాపుట్
  • 22835/22836 షాలిమార్ – పూరి ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి పూరి
  • 22855/22856 సంత్రాగచి – తిరుపతి ఎక్స్‌ప్రెస్ సంత్రాగచి నుండి తిరుపతి
  • 18047/18048 అమరావతి ఎక్స్‌ప్రెస్ గోవా హౌరా
  • 12571/12572 హౌరా - సత్య సాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి పుట్టపర్తి
  • 18103/18104 జులియన్‌వాలాబాగ్ ఎక్స్‌ప్రెస్ టాటానగర్ నుండి అమృత్‌సర్
  • 12835/12836 హతియా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ హతియా నుండి యశ్వంతపూర్
  • సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • 12834/12835 హౌరా - అహ్మదాబాద్ హౌరా నుండి అహ్మదాబాద్
  • 12841/12842 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి చెన్నై
  • 12863/12864 హౌరా - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి యస్వంత్పూర్
  • 12810/12809 హౌరా - ముంబై మెయిల్ హౌరా ముంబై


                                     

3.2. దక్షిణ తూర్పు రైల్వేచే నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్లు ఇంటర్‌సిటీ రైళ్ళు

  • 12871/12872 ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి టిట్లఘర్
  • 12883/12884 రూపసి బంగ్లా ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి పురూలియా
  • 12021/12022 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి బార్బిల్
  • 18001/18002 కందారి ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి డిఘా
  • 18007/18008 షాలిమార్ – బరిపాద ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి బరిపాద
  • 12885/12886 అరణ్యక ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి భోజుధి
  • 12865/12866 లాల్‌మతి ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి పురూలియా
  • 12821/12822 ధౌలి ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి పూరి
  • 12575/12576 ఖరగ్‌పూర్ – పురూలియా ఎక్స్‌ప్రెస్ ఖరగ్‌పూర్ నుండి పురూలియా
  • 12857/12858 తామ్రలిప్త ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి డిఘా
  • 18003/18004 ఝార్‌గ్రాం - పురూలియా ఎక్స్‌ప్రెస్ ఝార్‌గ్రాం నుండి పురూలియా
  • 18617/18618 హౌరా – రాంచి ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి రాంచి
  • 12814/12813 స్టీల్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి టాటానగర్
  • 12827/12828 హౌరా – పురూలియా ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి పురూలియా
  • 22861/22862 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుండి బంకూర
  • 12891/12892 బరిపాద ఎక్స్‌ప్రెస్ బాంగ్రీపోసీ నుండి భువనేశ్వర్
                                     

3.3. దక్షిణ తూర్పు రైల్వేచే నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్లు నాన్ స్టాప్ రైళ్లు

  • 12847/12848 హౌరా – డిఘా దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12222/12223 హౌరా – పూణే దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12261/12262 హౌరా – ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12245/12246 హౌరా – యశ్వంతపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్