Топ-100
Back

ⓘ నాల్గవ గుండయ. బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి. చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి ..




                                               

కాకతీయుల వంశవృక్షము

తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. వీరి కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ సామ్రాజ్యము 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో పతనమయ్యింది.

                                               

మొదటి ప్రోలరాజు

మొదటి ప్రోలరాజు 1030 - 1075 మొదటి బేతరాజు కుమారుడు. అతనికి అరికేసరి/అరిగజ కేసరి, కాకతి వల్లబ బిరుదులు ఉన్నాయి. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి. ఇతని పాలన కాలం క్రీ.శ 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం. మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలలో సహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి హనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. పశ్చిమ చాళూక్యుల వరాహ రాజ చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి సోమేశ్వరుడు అతనికి అనుమతినిచ్చాడు. ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, ...

                                               

కాకతి వెన్నయ

కాకతి వెన్నయ దుర్జయ వంశంలో జన్మించాడు. అతను కాకతీయ వంశ స్థాపకుడు. కాకతి పురాన్ని నివాస స్థానంగా చేసుకొని పరిపాలించాడని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది. చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉన్నది. కాకతీయులు నాడు రాష్ట్రకూటుల సామంతులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. వెన్నయ రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని సామంతునిగా తెలంగాణ ప్రాంత పరిపాలకుడిగా ఉన్నాడు. బయ్యారం శాశనం ప్రకారం ఇతను దుర్జయ వంశమునకు మూలపురుషుడు. కాకతీయుల పూర్వుల గురించి మాంగల్లు శాసనం వివరిస్తుంది. .

                                               

ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు. రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది.inka cheppali antey rudrama devikidevidevi

                                               

రుద్రమ దేవి

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ గణపతిదేవుడు, పాలకుడైన జయాపసేనాని సోదరీమణులైన నారంభ, పేరాంభలను వివాహ మాడినాడు, వీరి ముద్దుల కుమార్తె రుద్రమదేవి. చేబ్రోలు శాసనం దీని గురించి తెలియజేస్తుంది. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివా ...

                                               

మాలిక్ మక్బూల్

మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ కమ్మ దుర్జయ వంశము. కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు. మారన రచించిన మార్కండేయ పురాణం గ్రంథాన్ని అంకితమొందినాడు. గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ, రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య పరిశోధన ప్రకారము వీరి ఇంటిపే ...

                                               

కాకతీయుల కళాపోషణ

ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్ర జాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. క్రీ.శ.1000–1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభువులుగ ...

                                     

ⓘ నాల్గవ గుండయ

బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి.

  • చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు.
  • దానార్ణవునికి తోడ్పడిన గుండ్యన నతవాడి నేటి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతం కి పాలకుడయ్యాడు. 973 లో జరిగిన అలజడుల్లో రాష్ట్రకూటవంశం అంతరించింది.
  • అయితే పశ్చిమ చాళుక్యసేనాని విరియాల ఎఱన సాయంతో ముదిగొండ చాళుక్య బొట్టు బేతడు గుండ్యనను చంపి 900 ప్రాంతాలలో రాజ్యం ఆక్రమించుకున్నాడు;.
  • ఇదేఅవకాశంగా గుండ్యన కుఱవాడిని కైవసం చేసుకున్నాడు.
  • రెండో తైలపుడు చాళుక్య వంశాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు. వేంగిలో జటాచోడభీముడుదానార్ణవుని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు.