Топ-100
Back

ⓘ అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. తరువాత కొన్ని రోజులకు పాండవుల వద్దకు వ్యాసుడువచ్చాడు. పాండవులు అతడికి ఎదురేగి సత్కరించారు. ధర్మరాజు వ్యాసుడిని చూసి మునీంద్రా! తమర ..
                                     
ⓘ అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము

తరువాత కొన్ని రోజులకు పాండవుల వద్దకు వ్యాసుడువచ్చాడు. పాండవులు అతడికి ఎదురేగి సత్కరించారు. ధర్మరాజు వ్యాసుడిని చూసి మునీంద్రా! తమరి దయవలన అశ్వమేధయాగముకు కావలసిన ధనము సమకూరింది. తమరు అనుమతిస్తే యాగమును ఆరంభిస్తాను అని అడిగాడు. వ్యాసుడు ధర్మనందనా! నీకు శుభము అగుగాక. అశ్వమేధయాగము నిర్విజ్ఞముగా నెరవేరుగాక అని ఆశీర్వదించాడు. ధర్మరాజు శ్రీకృష్ణా! ఆపద్భాంధవా! నీ కృపాకటాక్షములతో భారత యుద్ధములో విజయము సాధించాము. ఈ అశ్వమేధయాగము కూడా నీ చేతుల మీదుగా జరిపించి మమ్ము కృతార్ధులను చెయ్యి. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీనీవె. నీవు ఆజ్ఞాపించు మేము నీ అజ్ఞానువర్తులమై అశ్వమేధయాగమును నెరెవేరుస్తాము అని శ్రీకృష్ణుడిని ధర్మరాజు ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు ధర్మనందనా! వ్యాసుడు ఆజ్ఞాపించాడు. మనము యజ్ఞము నిర్వహిస్తాము. ఈ యాగముతో నీ పరితాపము పటాపంచలు ఔతుంది. అన్ని ఫలముల కంటే అశ్వమేధయాగ ఫలము మేలైనది అని నేను నీకు ముందే చెప్పాను. నేను నిన్ను అశ్వమేధయాగము చెయ్యమని చెప్పాను అందుకని ఇక నా అనుజ్ఞ నీకు అవసరము లేదు. యజ్ఞకర్తవైన నీవు,మమ్ము ఆజ్ఞాపించు. మేము నీ ఆజ్ఞానువర్తులమై యాగమును నిర్వహిస్తాము అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు వ్యాసుడితో మహానుభావా! యాగదీక్షకు తగిన ముహూర్తము మీరే నిర్ణయించి తగిన సంస్కారమును ఆచరించండి అని ప్రార్థించాడు. వ్యాసుడు ధర్మనందనా! ఈ యాగమును నేను, యజ్ఞవల్క్యుడు, పైలుడు ముగ్గురమూ కలిసి నిర్వహిస్తాము. రాబోవు చైత్ర మాసములో పౌర్ణమి నాడు దివ్యమైన ముహూర్తము. యజ్ఞాశ్వము కొరకు అశ్వ నిపుణులను నియమించు. యాగములో వెదోక్తముగా విడువబడిన అశ్వము ఈ భూమండలము అంతటా తిరుగుతూ ని యశస్సును భూమండలము అంతా వ్యాపింపచేస్తుంది. యాగముకు కావలసిన సంభారములు సిద్ధము చేయించు అని ఆదేశించాడు వ్యాసుడు. ధర్మరాజు అశ్వశాస్త్రము తెలిసిన వారిని పిలిపించి సకల శుభలక్షణములు కలిగిన అశ్వమును ఎంపిక చేసి తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. యజ్ఞముకు కావలసిన పనిముట్లను బంగారముతో చేయించమని ఆజ్ఞలు జారీచేసారు. త్వరలోనే ఉత్తమాశ్వము యజ్ఞానికి కావలసిన పనిముట్లు తయారయ్యాయి. ధర్మరాజు వ్యాసుడి వద్దకు వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని తెలియచేసాడు. వ్యాసుడు అశ్వమును చూసి తృప్తి చెందాడు. ధర్మరాజు మహర్షీ! ఈ అశ్వమును వెదోక్తముగా అర్చించి వదలిన తరువాత దీని వెంట దీని రక్షణార్ధము వెళ్ళవలసిన వీరుడెవరో మీరు నిర్ణయించండి. వ్యాసుడు ధర్మనందనా! వేరెవరు దివ్యాస్త్రకోవిదుడు, బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, శౌర్యవంతుడు అయిన అర్జునుడే అందుకు సమర్ధుడు. నీవు యాగదీక్షలో ఉంటావు. భీముడు, నకులుడు రాజ్యరక్షణ భారము వహిస్తారు. సహదేవుడు అంతఃపుర రక్షణభారము వహిస్తాడు అని వ్యాసుడు చెప్పాడు. ధర్మరాజు అర్జునా! వ్యాసుడి మాటలు విన్నావు కదా! ఈ యాగశ్వమును రక్షించ వలసిన బాధ్యత నీదే. ఈ పని వేరెవరికి సాధ్యము కాదు. కనుక యాగాశ్వము రక్షణబాధ్యత వహిస్తూ అశ్వము సంచరించు ప్రాంతాలలో ఉన్న రాజులకు ఇది యాగదీక్షలో ఉన్న యాగాశ్వము అని చెప్పి దీనిని నిరాటంకంగా అన్ని ప్రాంతంలో తిరిగేలా చూడు. ఈ యాగాశ్వమును పట్టుకున్న రాజులను చంపక వారిని యాగముకు ఆహ్వానించు అని ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. వ్యాసుడు ఆదేశించిన విధముగా రాజ్య రక్షణకై భీముని, నకులుని నియోగించి అంతఃపుర రక్షణకు సహదేవుడిని నియమించాడు. మిగిలిన పనులకు ఆయారంగాలలో నిష్ణాతులను నియమించాడు. ధృతరాష్ట్ర, గాంధారిల అనుమతి తీసుకున్నాడు. తల్లి కుంతీదేవి అనుమతి తీసుకుని ద్రౌపదితో చేరి యాగము చేయడానికి ఉద్యుక్తుడు అయ్యాడు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.

  • ఆశ వ స ల న న య వన పర వమ ప రథమ శ వ సమ వన పర వమ ద వ త య శ వ సమ వన పర వమ త త య శ వ సమ వన పర వమ చత ర థ శ వ సమ వన పర వమ ప చమ శ వ సమ వన పర వమ షష టమ శ వ సమ
  • స ప త క పర వమ స త ర పర వమ శ త పర వమ అన శ సన క పర వమ అశ వమ ధ పర వమ ఆశ రమవ స పర వమ మ సల పర వమ మహ ప రస ధ న క పర వమ స వర గ ర హణ

Users also searched:

...
...
...