Топ-100
Back

ⓘ విజ్ఞానశాస్త్రం. Kona jadu reddy విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం. ప్రస్తుతం ఈ శా ..
                                               

లోహక్రియ

లోహక్రియ అనేది విభిన్నమైన లోహాలతో పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ పనిముట్లు అవసరం ఉంటుంది. లోహక్రియ ఒక కళ, అలవాటు, పరిశ్రమ, వ్యాపారం. ఇది లోహసంగ్రహం, విజ్ఞానశాస్త్రం, కంసాలీపని మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట ఆయుధాలుగా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను ఆభరణాలుగా మలిచేవారిని కంసాలి Goldsmith అంటారు.

                                               

ఒద్దిరాజు రాఘవ రంగారావు

ఈయన తల్లి రంగనాయకమ్మ, తండ్రి వేంకటరామారావు దంపతులకు 1894 లో జన్మించారు. ఈయన తెలంగాణా ప్రాంతంలో మొట్టమొదటి పత్రిక తెనుగు పత్రికను 1922లో ప్రారంభించిన ఒద్దిరాజు సోదరులలో ఒకరు. పత్రిక ద్వారా జనసామాన్యంలో విజ్ఞానవ్యాప్తికి, దేశభక్తి పెంపొందించడానికి ఎంతో కృషి చేసారు. వీరిది మానుకోట తాలూకా ఇనుగుర్తి ప్రస్తుతం వరంగల్ జిల్లా, కేసముద్రం మండలంలో ఉన్నది. 1894 ఏప్రిల్ 4వ తేదీన జన్మించారు. ఒద్దిరాజు సోదరులు విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి వందకు పైగా తెలుగు పుస్తకాలను ప్రచురించారు. వీటిలో విజ్ఞానశాస్త్రం, హస్తకలలు, ఛాయాగ్రహణం మొదలైన విషయాలకు సంబంధించిన గ్రంథాలున్నాయి. నైజాం ప్రాంతంలో తెలుగుభాషాభి ...

                                               

విశ్వోదయ కళాశాల

విశ్వోదయ కళాశాల కావలి పట్టణంలోని ప్రసిద్ధి వహించిన విద్యాసంస్థ. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఇంజనీరింగ్, వైద్యం, మేనేజ్ మెంట్, ఔషధ విజ్ఞానశాస్త్రం వంటి వివిధ వైద్యసంస్థలకు మూలసంస్థగా భాసిస్తోంది.

                                               

ఔత్సాహిక శాస్త్రజ్ఞులు

ఔత్సాహికులు అనగా ఏదైనా రంగంలో విషయాన్ని ప్రధాన వృత్తిగా కాక అదనపు ప్రవృత్తిగా ఆచరించేవారు. ఇందుకు భిన్నంగా అదే వృత్తిగా స్వీకరించినవారిని ప్రొఫెషనల్స్ అంటారు. ఈ పదాలు అన్ని రంగాలకూ వర్తిస్తాయి. కాని క్రీడారంగం, ఫొటోగ్రఫీ, విజ్ఞానశాస్త్రం, రేడియో వంటి విషయాల్లో ఈ మాటను ఎక్కువగా వాడుతారు. ఇదే పదం ఆధారంగా ఒక విజ్ఞాన శాస్త్ర రంగంలో నూతనంగా ప్రవేశించిన, అంతగా అనుభవంలేకపోయినా, చాలా ఉత్సాహం కలిగిన వారిని ఔత్సాహిక శాస్త్రజ్ఞులు అనవచ్చును. ఔత్సాహికులు అంటే ఎవరు? అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయా అభిప్రాయాలకు కొన్ని మినహాయింపులూ ఉంటాయి. సాధారణంగా ఔత్సాహికులు ఆయా రంగంలోకి క్రొత్తగా వచ్చి ఉంటార ...

                                               

గుమ్మా శంకరరావు

ఇతడు 1933, ఫిబ్రవరి 10వ తేదీన విశాఖపట్టణం జిల్లా ప్రస్తుతపు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చామలాపల్లి అగ్రహారంలో జన్మించాడు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1972లో తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. పట్టా స్వీకరించాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు" అనే అంశంపై సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో పరిశోధించి సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. హైదరాబాదులోని తెలుగు అకాడమీలో చాలాకాలం భాషానిపుణుడిగా పనిచేశాడు.

                                               

ప్రత్యక్ష దైవం (సినిమా)

సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తూ, ఆయన వర ప్రసాదం వల్ల కుమారుని పొందాలని కలలు కనే భక్తురాలికి దుష్టుడు, స్మగ్లర్, నాస్తికుడు అయిన భర్త లభిస్తాడు. అతనిలో మార్పు తేవాలని ప్రయత్నించిన ఆ స్త్రీ భర్తకే దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా దైవం ఆమెను అనుగ్రహిస్తాడు.ఆమెకు వరప్రసాది అయిన కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారస్వామి తన లీలలతో విచ్ఛిన్నమైన ఆ కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాడు. అదే విధంగా వివిధ ప్రాంతాలలో భక్తులు కుమారస్వామిని ఆరాధించి తరించిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు. విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దేవుడు వచ్చి మనుషులను కాపాడడం అసంభవమని నమ్మే ఒక డాక్టరు ప్రమాదవశ ...

విజ్ఞానశాస్త్రం
                                     

ⓘ విజ్ఞానశాస్త్రం

Kona jadu reddy

విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం.

ప్రస్తుతం ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది. ప్రకృతి శాస్త్రంలో భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. సామాజిక శాస్త్రంలో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. గణిత శాస్త్రం లాంటివి సాంప్రదాయ శాస్త్రము|సాంప్రదాయ శాస్త్రాల క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పడ్డవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు. విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే ఇంజనీరింగ్, వైద్యశాస్త్రం లాంటి రంగాలను అనువర్తిత శాస్త్రాలుగా చెప్పవచ్చు.

మధ్యయుగంలో మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన అల్ హజెన్ అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రం పై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు. ప్రాచీన కాలం నుంచీ 19వ శతాబ్దం వరకు విజ్ఞానశాస్త్రాన్ని ఇప్పుడున్న స్వరూపంగా కాక తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం మొదలైన రంగాల మీద పరిశోధన చేసేవారు. ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని తత్వ శాస్త్రం ప్రకారం నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని విభజిస్తే మధ్యయుగపు మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా పదార్థాలను వివధ రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారు.

17, 18 వ శతాబ్దాలలో శాస్త్రవేత్తలు శాస్త్ర పరంగా తాము కనుగొన్న సత్యాలను కొన్ని ప్రకృతి నియమాల రూపంలోకి సూత్రీకరించే ప్రయత్నం చేశారు. 19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం పరిశోధనల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది. 19వ శతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి శాస్త్రాలు ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు రూపుదిద్దుకున్నాయి.