Топ-100
Back

ⓘ జడివాన అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబధించిన 10వ తరగతి తెలుగు పాఠం. దీని రచయిత ఎర్రన. ఇతడు 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈ పాఠం ఎర్రన రాసిన హరివంశం పూర్వభాగంలోని ఏడవ అశ ..




                                               

భూలోక రంభ

భూలోక రంభ డి.యోగానంద్ దర్శకత్వంలో 1958, మార్చి 14న విడుదలైన సినిమా. తమిళ తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరణ జరిగింది. తమిళ చిత్రం భూలోక రంబై అదే సంవత్సరం జనవరిలో విడుదలైంది.

                                     

ⓘ జడివాన

జడివాన అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబధించిన 10వ తరగతి తెలుగు పాఠం. దీని రచయిత ఎర్రన. ఇతడు 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈ పాఠం ఎర్రన రాసిన హరివంశం పూర్వభాగంలోని ఏడవ అశ్వాసంలోనుండి గ్రహించబడింది.

                                     

1. జడివాన కురవడానికి కారణం

ప్రతి సంవత్సరం గోపాలకులు ఇంద్రుడిని పూజిస్తారు. దీనినే ఇంద్రోత్సవం అంటారు. కాని కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించమంటాడు. గోపాలకులు కృష్ణుడి ఆజ్ఞానుసారం గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. అందుకు కోపగించుకున్న ఇంద్రుడు రేపల్లెపై జడివానను కురిపిస్తాడు.

                                     

2. ఆకాశంలో మేఘాలు విస్తరించుట

  • దిక్కులనే ఆడ ఏనుగు పిల్లలు ఒక్కసారిగా ఆకాశంలో విస్తరిస్తే ఎలా ఉంటాయో,
  • ఆ విధంగా ఆకాశంలో మేఘాలు విస్తరించాయి.
  • కులపర్వతాలు పెల్లగింపబడి ఆకాశంలో వెలిస్తే ఎలా ఉంటాయో,
  • పాతాళ లోకంలోని చీకట్లు సూర్యుడిని మింగడాని ప్రయత్నిస్తే ఎలా ఉంటాయో,
  • సముద్రాలలోని తరంగాలు ఆకాశంలో వెలిస్తే ఎలా ఉంటాయో,

ఆ మేఘాల సమూహం నుండి వర్షం ప్రారంభమైంది. భూమికి, ఆకాశానికి మధ్య సందు ఏ మాత్రం కనిపించకుండా జడివాన కురుస్తుంది.

                                     

3. జడివాన వలన కలిగిన బాధలు

  • గోపాలకులు కురిసే జడివాన వలన చాలా బాధలు పడుతున్నారు. వారి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియక బాధ పడుతున్నారు.
  • ఆ జడివాన పశువులకు కూడా బాధను కలిగిస్తుంది. అంతటితో ఆగకుండా సమస్త ప్రాణులను నాశనం చేసే విధంగా చెలరేగుతుంది.
  • చనిపోయిన పక్షులు ఎక్కడ చూసినా సరే నీటి ప్రవాహాలలో తేలుతూ కనిపిస్తున్నాయి.
  • జడివాన ఆ అడవిలోని సమస్త చెట్ల సమూహానికి, సమస్త పక్షుల సంతతికి బాధను కలిగిస్తుంది.
  • మరి సింహాల పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన జంతువుల పరిస్థితి గురించి చెప్పవలసిన అవసరం లేదు.
  • కొండ గుహలలో నివసించే సింహాలు మేఘాల గర్జనలకు భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి.
జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన (పాట)
                                               

జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన (పాట)

జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన పాట 2011లో విడుదలైన జై బోలో తెలంగాణా చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు అందెశ్రీ కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. చక్రి సంగీతం అందించిన ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ పాడాడు.