Топ-100
Back

ⓘ కళలు ..
                                               

అంబర్ రూమ్‌

అంబర్ రూమ్‌ అనేది అంబర్ పలకలలో బంగారు ఆకులు, అద్దాలు అమర్చి అలంకరించబడిన ఒక ప్రపంచ ప్రసిద్ధ గది. ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కాథరిన్ ప్యాలెస్‌లో ఉంది. అసలైన అంబర్ రూమ్‌ నిజానికి ప్రూసియాలో 18 వ శతాబ్దంలో నిర్మించబడింది, అసలైన అంబర్ రూమ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కొల్లగొట్టబడింది, తరువాత అది ఏమయ్యిందో తెలియకుండా పోయింది, తరువాత మళ్ళీ అంబర్ గదిని పోలిన నమూనాతో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 1979లో మరో గది నిర్మాణం మళ్లీ ప్రారంభి 2003 కి తిరిగి సృష్టించారు. కోల్పోయిన అసలైన అంబర్ గది పూర్వం "ప్రపంచపు ఎనిమిదవ అద్భుతము"గా భావించబడింది. అంబర్ రూమ్ నిర్మాణం మొదట ప్రూసియాలో 1701 మధ్యన జరిగిం ...

                                               

అగ్ని శ్వాస

నోటిలో కొంత ఇంధనాన్ని ఉంచుకొని ఆ నోటిలోని ఇంధనాన్ని శ్వాస ద్వారా వెలుపలికి వెదజిమ్మడం ద్వారా వెలువడిన ఇంధనపు తుంపర వెలుపల ఉన్న మంటను తగిలినప్పుడు, ఆ ఇంధనం మండుట ద్వారా అగ్నికీలలు ఏర్పడతాయి. సరైన సాంకేతిక, సరైన ఇంధనాన్ని ఉపయోగించి సాహాసోపేతమైన నిపుణులు అగ్ని శ్వాస ద్వారా సృష్టించే అగ్ని కీలలు ప్రేక్షకులకు అపాయం జరుగబోతున్నదేమోనని భ్రమ కలిగిస్తాయి. సాహాసోపేతమైన ఈ విన్యాసాలు ప్రేక్షకులలో ఆత్రుత ను, అశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంధనం దహనమయ్యేందుకు కావలసిన ప్రాణవాయువు, ఉష్ణం సంతులితంగా ఉన్నప్పుడే అగ్నిశ్వాసతో అగ్నిగోళాలు సృష్టించడానికి అనువుగా ఉంటుంది.

                                               

ఇంద్రజాలం

ఇంద్రజాలం ఒక విధమైన కళారూపము. భారతదేశం "ఇంద్రజాల భూమి" అని ప్రసిద్ధిచెందినది. ఇక్కడ వీధులలోను, వేదికల మీదా ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు, ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది. ఇంద్రజాలం హిందువుల దేవరాజైన ఇంద్రుడు Indra, జాలం Net అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. భారతీయ సాంప్రదాయ ఇంద్రజాలంలో పేరుపొందినవి భారతీయ తాడు, భారతీయ తట్ట, పచ్చ మామిడి మర్మం, కప్పులు, బంతి, ఎగిరే మనిషి.

                                               

ఒరిగమి

ఒరిగమి పేపర్‌తో కళాకృతులు తయారుచేసే ప్రాచీన జపాన్ కళ. తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ఒరి అంటే మలచడం, కమి అంటే పేపర్ అని అర్థం. జపాన్‌కు అవతల కూడా ఈ కళ ప్రాచుర్యాన్ని పొంది, కాలంతోపాటు ఆధునికతను తనలో జత చేసుకుంది.

                                               

కథక్

రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.

                                               

కలంకారీ

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు. కారీ అనగా హిందీ లేదా ఉర్దూలో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్, భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు. ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను ...

కరాటే
                                               

కరాటే

కరాటే ఒక యుద్ధ కళ. జపాన్ భాషలో కరాటే అనగా వట్టి చేతులు అని అర్ధం. ఇది చాలా ప్రాచీన యుద్ధ విద్య.ఎన్నో మార్షల్ కళలలో ఇదొకటి. ఇది జపాన్ దేశములో పుట్టింది. Charitra

కుట్టుపని
                                               

కుట్టుపని

కుట్టుపని అనగా సూది, దారంతో చేతితో కుట్టడానికి అనువైన వస్తువులను కుట్లు వేయడం ద్వారా అవసరానికి తగ్గట్లుగా కలిపి తయారుచేయు లేదా చిరిగిన వాటికి అతుకులు వేయు చేతిపని లేదా హస్తకళ.

భారతీయ శాస్త్రీయ నృత్యం
                                               

భారతీయ శాస్త్రీయ నృత్యం

భారతీయ శాస్త్రీయ నృత్యం, భరతముని యొక్క నాట్యశాస్త్రము ప్రకారం గల భారతీయ నాట్య రీతులు. భారత్ కు చెందిన సంగీత నాటక అకాడమీ చే గుర్తింపబడిన భారతీయ శాస్త్రీయ నాట్యరీతులు గూడానూ. సత్త్రియ నృత్యం - అస్సాం కథాకళి - కేరళ ఒడిస్సీ - ఒడిషా కథక్ - ఉత్తర భారతం ఎక్కువగా ఈ కళ ఉత్తరప్రదేశ్లో ప్రదర్శింపబడుతోంది. మణిపురి - మణిపూర్ భరతనాట్యం - తమిళనాడు కూచిపూడి నాట్యం - ఆంధ్రారాష్ట్రం మోహినీ అట్టం - కేరళ