Топ-100
Back

ⓘ భారతీయ సంస్కృతి. భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక. భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశము లో ..
                                               

భారతీయ రూపాయి చిహ్నము

భారతీయ రూపాయి 2010 లో ఒక చిహ్నాన్ని సంతరించుకుంది. యూనికోడ్ భాషలో అది U+20B9. HTML భాషలో "&#x 20B9;" మధ్యలో ఖాళీ లేకుండా రాస్తే గుర్తు కనబడుతుంది. ఈ చిహ్నం యొక్క డిజైనును 2010 జూలై 15 నాడు భారతదేశ ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ చిహ్నం చూడటానికి దేవనాగరి లిపి యొక్క "र", ఆంగ్ల భాష యొక్క అక్షరం "R" కలగలిపినట్లు వుంటుంది. 2009 వ సంవత్సరములో రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీని భారత ప్రభుత్వం నిర్వహించింది. 3.331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడ్డాయి. వీటిలో నుంచి ఐఐటి గౌహతికి చెందిన డి.ఉదయ్ కుమార్ సమర్పించిన చిహ్నాన్ని మంత్రివర్గం ఎన్నుకుంది. మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి పెద్ద ...

                                               

భారతీయ నాట్యం

భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం / భారతీయ నృత్యం అంటారు. భారతదేశంలో అనేక నాట్యరీతులు కానవస్తాయి.శాస్త్రీయంగా చూస్తే,ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యంలు ఉన్నాయి.అలాగే బాలీవుడ్లో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నది. భారతీయ నాట్యరీతులు అనేక విధాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు జానపద, గిరిజన నృత్యాలు. సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమ ...

                                               

భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ, భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి. స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు యొక్క ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పా ...

                                               

భారత దేశం

భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో రెండో స్థానం కలిగి వుంది, వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తి ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో భారత దేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య ...

                                               

దీనదయాళ్ ఉపాధ్యాయ

దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్‌ లోని మధుర దగ్గర నగ్ల చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు. 1952లో భారతీయ జన సంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లొ జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపధంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నొ దినపత్రిక స్వదేశ్లకు సంపాదకీయ ...

                                               

కుంకుమ

కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక, నిమ్మరసం వాడతారు. కుంకుమను సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం మొత్తం ఏడు చక్రాలు శక్తికేంద్రాలు గా విభజింపబడి ఉంటుంది. ఇవి వెన్నుపాము చివరన మూలాధార చక్రంతో మొదలై తలపైన సహస్రాధార చక్రంలో అంతమవుతాయి. ఇందులో ఆరోది రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం. దీనినే ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతి లో గురువుల నమ్మక ...

                                     

ⓘ భారతీయ సంస్కృతి

భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక. భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశము లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ, ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది, ఇది భారత ఉపఖండం మొత్తంలో విస్తరించి ఉంది, అనేక వేల సంవత్సరాల చరిత్రను ప్రభావితం చేసింది. భారతీయ సంస్కృతిలో వైవిధ్యమైన భాగంగా ఉన్న భారతీయ మతాలు, భారతీయ తత్వశాస్త్రం, భారతీయ వంటకాలు వంటి అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రభావం కలిగి ఉన్నాయి.

                                     

1. సంస్కృతి

భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు వాటి వివిధ సంస్కృతులు, నాగరికతలతో వైవిధ్యమైన సంస్కృతి కలిగినది, ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటి. భారతీయ సంస్కృతిని తరచూ పలు విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పిలుస్తారు, ఇది భారత ఉపఖండంలో మొత్తం వ్యాపించింది. దాదాపుగా 5000 సంవత్సరాలకు పూర్వం నుండే భారత సంస్కృతి ఉన్నట్టు చరిత్ర కారులు చెబుతారు ఇది అనేక వేల సంవత్సరాల పురాతనమైన చరిత్రచే ప్రభావితం చేయబడింది, మలచబడి ఉంది. భారతదేశ చరిత్ర మొత్తంలో, భారతీయ సంస్కృతి ధార్మిక మతాలచే బాగా ప్రభావితం చేయబడి ఉంటుంది. భారతీయులు, భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, వాస్తుశిల్పం, కళ, సంగీతం రూపొందించడంలో చాలా ఘనత పొందారు. గ్రేటర్ ఇండియా భారతీయ సంస్కృతి చారిత్రక పరిధి అనేది భారతీయ ఉపఖండం నకు మించింది. ఇది ముఖ్యంగా హిందూ మతము, బౌద్ధమతం, వాస్తు, శిల్పం, భవన నిర్మాణ శాస్త్రం పరిపాలన, వ్రాత వ్యవస్థలు కామన్ ఎరా ప్రారంభ శతాబ్దాల్లో ప్రయాణీకులు, సముద్ర వ్యాపారులు సిల్క్ రోడ్ ద్వారా ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. గ్రేటర్ ఇండియా పశ్చిమాన, హిందూ కుష్, పామిర్ పర్వతాలలో గ్రేటర్ పర్షియాతోను కలసి విస్తరించి ఉంది. అనేక శతాబ్దాలుగా, బౌద్ధులు, హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, భారతదేశంలోని వివిధ గిరిజన ప్రజల మధ్య వివిధ సంస్కృతుల గణనీయమైన కలయికను కలిగి ఉంది.

భారతదేశం హిందూ మతం, బౌద్ధమతం, జైన మతం, సిక్కు మతం, ఇతర మతాలు జన్మస్థలం. వీటిని సమష్టిగా భారతీయ మతాలు అని పిలుస్తారు. నేడు, హిందూమతం, బౌద్ధమతం వరుసగా మూడో, నాల్గవ అతిపెద్ద మతాలుగా ఉన్నాయి, వీటిలో 2 బిలియన్ల మంది మతాన్ని ఆరాధించి ఆచరించే అనుచరులు ఉన్నారు., దాదాపుగా 2.5 లేదా 2.6 బిలియన్ల మంది ఆదరించి అనుసరించే అనుచరులు ఉన్నారు. భారతీయ మతాలను ఆరాధించి ఆచరించే అనుచరులు అయినటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు భారతదేశంలో 80-82% జనాభా ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ఆరాధనతో కూడిన మత సంఘాలు, సంస్కృతులతో కలిగి ఉండి మతపరంగా, జాతిపరంగా విభిన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ మతాలు అనేకమంది ప్రజల జీవితంలో కేంద్ర స్థానంలో ఉండి, నిర్ణయాత్మక, నిశ్చయాత్మక పాత్రను వారి మీద పోషిస్తున్నాయి. భారతదేశం ఒక లౌకిక హిందూ-మెజారిటీ దేశం అయినప్పటికీ, ఈ దేశంలో అతి పెద్ద ముస్లిం జనాభాను ఇది కలిగి ఉంది. భారతదేశం లోని జమ్మూ కాశ్మీర్, లఢక్, పంజాబ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, లక్షద్వీప్ లను మినహాయించితే హిందువులు 24రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు. అదేవిధముగా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్, లక్షద్వీప్ లలో మాత్రం ఎక్కువమంది ముస్లిం జనాభా ఉన్నారు. అలాగే సిక్కులు, క్రైస్తవులు భారతదేశంలోని ఇతర ముఖ్యమైన మైనారిటీ ప్రజలు ఉన్నారు.

2011 సం.జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 79.8% మంది హిందూ మతాన్ని ఆచరించి, పాటిస్తున్నారు. భారతదేశంలో హిందూ మతము అనుసరించి ఆచరించే ప్రజలు తరువాత ఇస్లాం 14.2%, క్రైస్తవ మతం 2.3%, సిక్కు మతం 1.7%, బౌద్ధ మతం 0.7%, జైనమతం 0.4% అనే ఇతర ప్రధాన మతాలు ఆచరించే వారు ఉన్నరు. హిందూ మతం, బౌద్ధమతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం వంటి ప్రధాన మతాలచే భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రభావితమైనప్పటికీ, సార్నాయిజం వంటి అనేక గిరిజన మతాలు కూడా భారతదేశంలో కనిపిస్తాయి. జైనమతం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం, బహాయి విశ్వాసం కూడా ప్రభావవంతమైనవి, కానీ వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో కూడా నాస్తికత్వం, అజ్ఞేయవాదం లక్షణాలు అక్కడాక్కడా కనిపించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులు, ముస్లింలను కలిగి ఉన్న దేశంగా ఉంటుంది. భారతదేశంలో సుమారు 311 మిలియన్ల ముస్లింలు జనాభాలో 19-20% మంది ఉన్నారు. ఇంకా సుమారు 1.3 బిలియన్ల హిందువులు జనాభాలో 76% మంది భారతదేశంలో నివసిస్తున్నారు.

                                     

2. కుటుంబ నిర్మాణం, వివాహం

భారతదేశంలో కొన్ని తరాల వరకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనే ప్రబలమైన సంప్రదాయం కలిగి ఉంది. తల్లిదండ్రులు, పిల్లలు, పిల్లల జీవిత భాగస్వాములు, వారి సంతానం మొదలైనవారు - కుటుంబ సభ్యులందరూ విస్తరించినప్పుడు - అందరూ కలిసి జీవిస్తుంటారు. సాధారణంగా, ఈ ఉమ్మడి భారత కుటుంబ వ్యవస్థలో అతి పెద్ద వయసుగల మగమనిషి ఆ కుటుంబానికి పెద్దగా ఉంటాడు. కుటుంబ పెద్ద తను అన్ని ముఖ్యమైన నిర్ణయాలు, నియమాలను ఎక్కువగా చేస్తాడు, ఇతర కుటుంబ సభ్యులు వాటిని ఆచరించి, ఆదరించి, అనుసరించి కట్టుబడి ఉంటారు.

                                     

2.1. కుటుంబ నిర్మాణం, వివాహం నిశ్చయ వివాహం

పెద్దలు నిర్ణయించి కుదిర్చిన పెళ్ళిని నిశ్చయ వివాహం అంటారు. నిశ్చయ వివాహాన్ని ఆంగ్లంలో ఆరేంజ్డ్ మ్యారేజ్ అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని హిందువులు నిశ్చయ వివాహాలను జరిపిస్తున్నారు. భారతీయ సమాజంలో నిశ్చయ వివాహాలు దీర్ఘకాలంగా మనగలిగి ఒక పద్ధతిలో కట్టుబడి ఉన్నాయి. నేటికి కూడా, ఎక్కువమంది భారతీయులు వారి తల్లిదండ్రులు, బంధువులు, ఇతర గౌరవనీయ కుటుంబం సభ్యుల ద్వారా మాత్రమే వివాహం చేసుకుంటారు. గతంలో, చిన్న వయస్సు నందే వివాహం జరిగేది. 2009 సం.లో, సుమారు 7% స్త్రీలు 18 సంవత్సరాల వయసులోపుననే వివాహం చేసుకున్నారు. 2011 సం. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో మహిళలకు వివాహం చేసుకునే సగటు వయసు 21 సంవత్సరాలుకు పెరిగింది.

                                     

3. బయటి లింకులు

  • Ministry of Culture, Government of India, Links to some cultural sites and available grants for understanding the cultural diversity of India
  • Indias intangible cultural heritage Another UNESCO site dedicated to Indian dance and other cultural heritage
  • India and World Cultural Heritage A UNESCO site describing cultural heritage sites of India