Топ-100
Back

ⓘ వితంతువు. హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి, విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్ ..
                                               

వివాహం (చలం రచన)

చలం రాసిన ఈ నవల అతను వివాహ వ్యవస్థను పూర్తిగా తిరస్కరించలేదని చూపిస్తుంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర అయిన "రావణ" లాంటి అమ్మాయికి, నిస్సహాయంగా, అసురక్షితంగా, వివాహం సమాజంలో భద్రతను అందిస్తుంది. స్వీయ-వాదనకు సాధనంగా మారుతుంది. "రావణ" పాత్ర ఆధునికమైనది, ఆమె తన వ్యక్తిత్వం గురించి స్పృహ కలిగి ఉంది. దృఢమైన మనస్సు కలిగి ఉంటుంది. ఆమె భర్త అయిన గోపాల రావు తన పేదరికం కారణంగా న్యూనతా భావనతో బాధపడుతుంటాడు. వారి మధ్య ప్రేమ, అనుబంధం పెరగడానికి పరిస్థితులు ఎలా దోహదపడతాయనేది ఆసక్తికరంగా ఉంటుంది, దీని కోసం వివాహ బంధం బలమైన ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. ఇది నవల ప్రధాన ఇతివృత్తం. ఈ నవల వాస్తవికతలో పాతుకుపోయింది. ...

                                               

కమలమ్మ కమతం

సిరులు పండే మాగాణి, మెట్ట వందల ఎకరాలు కలిగి ఉన్న కమలమ్మ మంచి వయసులో ఉంటుంది. అయితే ఆమె వితంతువు. పాలేరు రాముడు ఆమెకు కొండంత అండగా ఉంటాడు. ఆ ఊరి మునసబు, ప్రెసిడెంటు, పూజారి కమలమ్మపైనా, ఆమె కమతంపైనా కన్నువేస్తారు. కమలమ్మ అన్నను తమవైపు తిప్పుకుంటారు. అయితే కమలమ్మ తన తెలివితేటలతో ఆ త్రిమూర్తుల ఎత్తులను చిత్తు చేస్తూ వుంటుంది. అన్నను దూరంగా పంపించివేస్తుంది. అన్న గదిని శుభ్రం చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన బూతు పుస్తకాలు ఆమెకు వికారాన్ని కలిగిస్తాయి. తనను తల్లిగా చూసుకునే రాముడి మీద ఆమె దృష్టి పడుతుంది. రాముడికి అతని అక్క కూతురితో పెళ్లి అవుతుంది. ప్రెసిడెంటు మనుషులు కుప్ప తగలపెట్టి ...

                                               

శ్రీ (2005 సినిమా)

శ్రీ 2005 భారతీయ తెలుగు చిత్రం, ఇందులో మనోజ్ మంచు, తమన్నా నటించారు. ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది. వాణిజ్యపరంగా విఫలమైంది.

                                               

అంతులేని కథ

అంతులేని కథ 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు. మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. కె.బాలచందర్ దర్శకత్వం, కథన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి.

                                               

ఆయనే ఉంటే మంగలెందుకు

ఆయనే ఉంటే మంగలెందుకు అనేది తెలుగు భాషలో వాడే ఒక సామెత. అనవసరపు సలహాలు ఇవ్వరాదు అనే దానికి ఈ సామెత ఉదాహరణ. సామెత వెనుక కథ పాత కాలం నాటి ఒక ఆచారం ఆధారంగా వాడుక లోకి వచ్చిన సామెత ఇది. పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, పూలు, ఆభరణాలను విసర్జించటంతో పాటు తలనీలాలను కూడా త్యజించవలసి వచ్చేది. వితంతువులు జుట్టు పెంచుకోకూడదనే నియమముండేది. నిందార్థకంగా వాడే "బోడి ముండ" అనే మాట కూడా ఈ ఆచారంలో నుంచి పుట్టిందే. వాళ్ళకున్న కట్టుబాట్లకు తోడు వీధిలో వాళ్ళకు ఎదురైన వాళ్ళు "అపశకునం" అని ఈసడించుకునే వాళ్ళు. అందువల్ల జుట్టు పెరిగినప్పుడల్లా వితంతు స్త్రీలు గుండు చేయించుకోవడానికి మంగలి దగ్గరకు వెళ్ళలేరు. ...

                                               

ఆపేక్ష (సినిమా)

ఆపేక్ష 1953లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది తమిళ సినిమా అంబుకు డబ్బింగ్ చేయబడిన సినిమా. దీనిని నటేష్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎం.నటేష్ నిర్మించాడు. ఈ సినిమాలో శివాజి గణేశన్, టి.ఆర్.రాజకుమారి, పద్మిని ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు కథ ఎం.నటేష్ రాయగా విద్యాధన్ సంభాషణలు రాసాడు. ఈ చిత్రానికి జి.విఠల్ రావు ఛాయాగ్రహణం చేసాడు. కూర్పు ఎస్.ఎ.మురుగేశన్ చేసాడు.

వితంతువు
                                     

ⓘ వితంతువు

హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి, విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు.

                                     

1. వితంతు కుమార్తె,విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హులే

పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈ విషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది.